సినిమా వార్తలు

యూత్ లక్ష్యంగా '24 కిస్సెస్' ట్రైలర్


11 months ago యూత్ లక్ష్యంగా '24 కిస్సెస్' ట్రైలర్

టాలీవుడ్ తెరపై ప్రేమకథా చిత్రాలు జోరు ప్రదర్శిస్తున్నాయి. కంటెంట్ వుంటే చాలు, కాసుల వర్షం కురిపించేలావున్నాయంటున్నారు. ఈ కోవలోనే యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన మరో చిత్రమే '24 కిస్సెస్'. అదిత్ అరుణ్ .. హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకి అయోధ్య కుమార్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే రొమాంటిక్ సీన్స్, వాళ్ల మధ్య జరిగే గొడవలపై ట్రైలర్ ను కట్ చేశారు. రావు రమేశ్.. నరేశ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను నవంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్ రేసులో వెనుకబడిపోయింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో వేచిచూడాలి.