సినిమా వార్తలు

నవంబర్ 3న '2.0' ట్రైలర్


12 months ago నవంబర్ 3న  '2.0' ట్రైలర్

రజనీకాంత్ కథానాయకుడిగా, అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో '2.ఓ' సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదలకోసం ఇటురజనీ అభిమానులు, అటు అక్షయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నవంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారని తాజా సమాచారం. అలాగే దీపావళి కానుకగా నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ ట్రైలర్ తో ఈ  సినిమాపై అమాంతంగా అంచనాలను పెరగనున్నాయని అంటున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా ఎమీ జాక్సన్ నటిస్తున్నారు.