సినిమా వార్తలు

'కథానాయకుడు'లో 11 పాటలు


10 months ago 'కథానాయకుడు'లో 11 పాటలు

క్రిష్ దర్శకత్వంలో హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విష‌యం విదిత‌మే. ఈ బయోపిక్ 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. సంక్రాంతి కానుకగా 'కథానాయకుడు'ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రయాణానికి సంబంధించిన విశేషాల సమాహారంగా ఈ భాగం ఉండ‌నుంది. 'కథానాయకుడు'లో మొత్తం 11 పాటలు ఉంటాయని తెలుస్తోంది. కథలోభాగంగా ఉండ‌టం వ‌ల‌న‌ వలన ఈ పాట‌లు  ఎక్కువైపోయాయి అనే ఫీలింగ్ ఎంతమాత్రం రాదని చిత్ర యూనిట్ భావిస్తోంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ .. రకుల్ .. నిత్యామీనన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.